16 September 2024

Composite School Grants for PM SHRI schools for phase 1and2

పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 8.63 కోట్లు నిధులు విడుదల
-సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు


భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు ఫేజ్ 1, ఫేజ్ 2 వార్షిక గ్రాంట్ల వినియోగం కింద  రూ. 8.63 కోట్లు నిధులు ఆమోదం తెలిపినట్లు సమగ్ర  శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
ఫేజ్ 1 కింద 662 పాఠశాలలకు రూ. 667.75 లక్షలు, ఫేజ్ 2 కింద 193 పాఠశాలలకు రూ. 195.0 లక్షలు ఆమోదించిందని పేర్కొన్నారు.  
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పీఎంశ్రీ పాఠశాలలు విద్యార్థుల అభ్యాసం కొనసాగింపును నిర్ధారించడంతోపాటు, తగినంత సడలింపుతో కూడిన విధానాన్ని పాటించాలని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి, ప్రతి పాఠశాల నిధుల్లో కనీసం 10% ను నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై దృష్టి సారించి స్వచ్ఛత చర్యా ప్రణాళికకు కేటాయించాలని తెలిపారు. 
ఈ వార్షిక పాఠశాల నిధులను విద్యుత్ చార్జీల చెల్లింపులు, చాక్స్, డస్టర్స్, చార్టులు, పాఠశాల విద్యా సామగ్రి (TLM), రిజిస్టర్లు/రికార్డులు తదితర స్టేషనరీ కొనుగోలు చేయడం, మరమ్మతులు, పాడైపోయిన పాఠశాల సామగ్రి, వినియోగపడని గేమ్స్, క్రీడా సామగ్రి, ప్రయోగశాలలు, ఇంటర్నెట్, నీరు, ఉపకరణాలు మొదలైనవి, విద్యా సంబంధిత దినోత్సవాలు, పాఠశాలలలో శానిటేషన్ మరియు హైజీన్‌ను మెరుగుపరచడానికి, క్రీడా మైదానాలు, కెమిస్ట్రీ ల్యాబ్స్, పాఠశాల నిర్వహణ కోసం అవసరమైన ఇతర ఖర్చులకు వినియోగించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు సూచించారు.


*రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున)
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

To Download : CLICK HERE  

No comments:

Post a Comment