A.P. GOs & CIRCULAR MEMOs

more

IMPORTANT OLD G.Os

more

22 May 2026

G.O.Ms.No. 70 Child Care Leave - Removing the upper age limit of the children Dated: 15.12.2025

            Public Services - Finance Department - Child Care Leave - Removing the upper age limit of the children - Orders - .Finance (HR-IV-FR&LR) Department G.O.Ms.No. 70 Dated: 15.12.2025



👨🏻‍💼చైల్డ్ కేర్ సెలవుల సమాచారo  

➤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన"చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leave - CCL)"నిబంధనలలో ప్రభుత్వం ఇటీవల అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది.

➤ డిసెంబర్ 15, 2025న విడుదల చేసిన జీవో ఎంఎస్ నం. 70 (G.O.Ms.No. 70, Finance Department) ద్వారా పాత నిబంధనలను సడలిస్తూ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది.

➤ ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ గురించిన పూర్తి సమాచారం, తాజా మార్పులు ఇక్కడ వివరంగా ఉన్నాయి :

1.అర్హత (Eligibility)


👩🏻‍🦱మహిళా ఉద్యోగులు :-

✦ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత/అర్హులైన మహిళా ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.*_

👨🏻‍💼ఒంటరి పురుష ఉద్యోగులు (Single Male Employees) :-

✦ భార్య చనిపోయిన వారు (Widower),విడాకులు తీసుకున్న వారు (Divorcee) లేదా వివాహం కాని ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా ఈ సెలవులను వర్తింపజేశారు.*_


2. సెలవుల పరిమితి (Maximum Leave Days):-

➯ అర్హులైన ప్రతి ఉద్యోగి తమ మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 180 రోజులు (6 నెలలు)చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకోవచ్చు.

➯ గరిష్టంగా ఇద్దరు పిల్లలసంరక్షణ కోసం మాత్రమే ఈ సెలవులను అనుమతిస్తారు.

3.తాజా మరియు అత్యంత ముఖ్యమైన మార్పులు (Latest Key Relaxations)

❍ గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఇవే:

➯ పిల్లల వయో పరిమితి తొలగింపు (No Upper Age Limit) :- గతంలో పిల్లలకు 18 ఏళ్లు (దివ్యాంగులైన పిల్లలకైతే 22 ఏళ్లు) వచ్చే వరకే ఈ సెలవులు వాడుకోవాలనే నిబంధన ఉండేది. అయితే, తాజా జీవో 70 ప్రకారం పిల్లల వయో పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు.సాధారణ పిల్లలకైనా,దివ్యాంగ (Differently-abled) పిల్లలకైనా వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకోవచ్చు.

➯ విడతల సంఖ్య పెంపు (Maximum Spells) :మొదట్లో ఈ 180 రోజుల సెలవును సర్వీస్ మొత్తంలో కేవలం 3 విడతల్లో (Spells) మాత్రమే వాడుకోవాలనే నిబంధన ఉండేది.కానీ ఆ తర్వాత చేసిన సవరణల (G.O.Ms.No. 199) ప్రకారం,ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సెలవులను గరిష్టంగా 10 విడతలలో (10 Spells)వాడుకునే వెసులుబాటు కల్పించారు.

4.సెలవుల వినియోగం ఎప్పుడు? (Purpose of Leave)

☛ పిల్లల సంరక్షణకు సంబంధించిన ఈ క్రింది అవసరాల కోసం ఈ సెలవులను వాడుకోవచ్చు:*_

☛ పిల్లల పెంపకం లేదా సంరక్షణ (Rearing).

☛ పాఠశాల లేదా కాలేజీ పరీక్షల సమయంలో పిల్లలకు సహాయంగా ఉండడానికి.

☛ పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు (Sickness) వారిని చూసుకోవడానికి.


5.ఇతర ముఖ్య నిబంధనలు


✦ ఈ సెలవుల కాలంలో ఉద్యోగికి పూర్తి జీతం (Full Salary) చెల్లిస్తారు.

✦ దీనిని ఒక హక్కుగా భావించలేము. కార్యాలయ పని ఒత్తిడి, అత్యవసర విధులను బట్టి సెలవు మంజూరు చేసే అధికారి (Sanctioning Authority) అనుమతి మేరకే దీనిని తీసుకోవాల్సి ఉంటుంది.

✦ తీసుకున్న సెలవుల వివరాలను ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ (Service Register - SR) లో ప్రత్యేకంగా నమోదు చేస్తారు.

To Download : CLICK HERE

0 Comments:

Post a Comment